మెగాస్టార్ చిరంజీవి భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. గురువారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సీనియర్ నటి వైజయంతిమాలకు కూడా పద్మవిభూషణ్ పురస్కారం అందించారు.

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో గురువారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ సంవత్సరం జనవరి 25న 132 మందికి అవార్డులు ప్రకటించారు. సినీ రంగంలో చిరంజీవి చేసిన సేవలకుగాను ఈ అవార్డు వరించింది. ఇక ఈ వేడుక‌లో చిరంజీవి భార్య సురేఖ‌తో పాటు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్, కోడ‌లు ఉపాసన ఉన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)