జూ.ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర నుంచి తాజాగా గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 'ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్నే ఎక్కువ చూసుండాది అందుకే దీన్ని ఎర్రసముద్రం అంటారు' అని ఫైట్ తర్వాత ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ మంచి హై ఇస్తోంది.

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర రెండు పార్టులుగా రాబోతోంది. ఈ ఏప్రిల్ 5న ఫస్ట్ పార్ట్.. పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. తాజాగా విడుదలైన 79 సెకన్ల పాటు ఉన్న గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా చేస్తున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)