తమిళ స్టార్ హీరో ధనుశ్, ఐశ్వర్య రజినీకాంత్.. సుమారు 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ దంపతులు 2022లోనే విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. ఆ తర్వాత నుంచి ఇద్దరు దూరంగానే ఉంటున్నారు. తాజాగా ఈ జంట అధికారికంగా చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.2022 జనవరిలో విడిపోతున్నట్లు ప్రకటించిన స్టార్ కపుల్ దాదాపు రెండేళ్ల తర్వాత అధికారికంగా విడాకుల కోసం పిటిషన్లు వేశారు. త్వరలో వారి కేసు విచారణకు రానున్నట్లు సమాచారం.2004లో ధనుశ్, ఐశ్వర్య ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరికీ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.
Here's News
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)