టాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌కమ్ముల (Shekhar Kammula) ప్రస్తుతం కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్ (Dhanush)తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఇటీవలే ముంబైలో భారీ షెడ్యూల్‌ షూటింగ్‌ షురూ అయినట్టు అప్‌డేట్ కూడా వచ్చింది.D51గా వస్తోన్న కుబేర (Kubera)గా ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. టాలీవుడ్ యాక్టర్‌ అక్కినేని నాగార్జున (Nagarjuna) కీలక పాత్ర పోషిస్తున్నాడు.శేఖర్‌ కమ్ముల మరో ఆసక్తికకర అప్‌డేట్ రాబోతుందంటూ హింట్ ఇచ్చాడు. ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది.. అనే క్యాప్షన్‌తో రిలీజ్‌ చేసిన తాజా వార్త మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ అమాంతం పెంచేస్తోంది. గుట్టు చప్పుడు టీజర్‌ వచ్చేసింది, బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌రావ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ట్రైలర్ ఇదిగో..

ఇప్పటికే లాంఛ్ చేసిన కుబేర ఫస్ట్‌ లుక్‌లో ధనుష్ చెదిరిన వెంట్రుకలు, మాసిన గడ్డంతో నవ్వుతూ కనిపిస్తూ నెట్టింట టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏషియన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సునీల్ నారంగ్‌, పీ రామ్‌మోహన్‌ రావు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. సోషల్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Here's Tweets

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)