గాడ్ ఫాదర్ మూవీ ఇంటర్యూ సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మద్దతుపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను జనసేనకు మద్దతు ఇస్తానో లేదో కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు చిరంజీవి. అదే సమయంలో పవన్ కల్యాణ్ స్థాయిని ప్రజలే నిర్ణయిస్తారని చిరంజీవి పేర్కొన్నారు.చిరంజీవి మాట్లాడుతూ..'నేను రాజకీయాల నుంచి తప్పుకుని సైలెంట్‌గా ఉన్నా. ప్రస్తుత రాజకీయాలపై నేను ఎలాంటి సెటైర్లు వేయలేదు. కేవలం సినిమాలో ఉన్న డైలాగులు మాత్రమే చెప్పా. పవన్‌ కల్యాణ్‌ జనసేనకు మద్దతు ఇస్తానో లేదో చెప్పలేను. నేను తప్పుకుంటనే పవన్‌కు లాభం చేకూరుతుందేమో' అని అన్నారు. దసరా కానుకగా గాడ్‌ ఫాదర్ ఆక్టోబర్‌ 5న థియేటర్లలో విడుదల కానుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)