సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న 'గుంటూరు కారం' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు (జనవరి 9) గుంటూరులో గ్రాండ్ గా నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించింది. వాస్తవానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 6న హైదరాబాద్ లో జరపాలని ప్లాన్ చేశారు. అయితే అనుమతులు లభించకపోవడంతో వాయిదా వేశారు.

తాజాగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గుంటూరుకు తరలించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వెల్లడించింది. గుంటూరులో నంబూరు క్రాస్ రోడ్స్ కు సమీపంలో భారత్ పెట్రోల్ బంకు పక్కన గుంటూరు కారం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది.

మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి తదితరులు నటించిన మాస్ ఎంటర్టయినర్ మూవీ 'గుంటూరు కారం' ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిన్న విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ రికార్డుల మోత మోగిస్తోంది. కేవలం 12 గంటల వ్యవధిలోనే రెండున్నర కోట్లకు పైగా వ్యూస్ సాధించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)