హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం అమితాబ్ బచ్చన్ దర్శనమిచ్చారు. పక్కనే సినిమా చిత్రీకరణ బృందం కూడా ఉంది. ఇది చూసిన మెట్రో ప్రయాణికులు తమ ఫోన్లలో దృశ్యాలను బంధించారు. అమితాబ్ బచ్చన్ 'ప్రాజెక్టు కె' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొంత కాలంగా హైదరాబాద్ పరిసరాల్లోనే జరుగుతోంది. ఇందులో ప్రభాస్, దీపికా పదుకొణె ప్రధాన నటీనటులు. ఓ మెట్రో యూజర్ రెడిట్ నెట్ వర్క్ లో అమితాబ్ షూటింగ్ గురించి పోస్ట్ పెట్టాడు.

‘‘నాకు తెలిసి అమితాబ్ షూటింగ్ కోసం వచ్చి ఉండొచ్చు. ఓ బ్లూ లైన్ ట్రెయిన్ లోకి ఎవరినీ అనుమతించలేదు. నేను అమీర్ పేట స్టేషన్లో సాయంత్రం 6 గంటలకు వేచి ఉన్నాను. మెట్రో ఒక డమ్మీ రైలును రద్దీ వేళల్లో ఎందుకు నడిపిస్తోందో నాకు అప్పుడు అర్థం కాలేదు. రైలులో అమితాబ్ కనిపించలేదు కానీ, మెడలో ఐడీ కార్డులు వేసుకున్న కెమెరామ్యాన్ లు కనిపించారు’’ అని పేర్కొన్నాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)