పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా విశాఖలో ఆయన అభిమానులు బీభత్సం సృష్టించారు.వైజాగ్‌లోని లీలా మహల్‌ థియేటర్‌లో జల్సా సినిమా ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ షోను ప్రదర్శించారు. అయితే థియేటర్‌లో పవన్‌ ఫ్యాన్స్‌ బీర్‌ బాటిల్స్‌ పగలకొట్టి స్క్రీన్ చించేశారు.సీట్లు ధ్వంసం చేయడంతో పాటు సీలింగ్‌ కూడా డామేజ్‌ చేశారు. పేపర్‌ ముక్కలు, గాజు పెంకులతో ప్రస్తుతం థియేటర్‌ పరిస్థితి అధ్వానంగా తయారైంది. దీంతో థియేటర్‌ యాజమాన్యం గగ్గోలు పెడుతోంది. పవన్‌ అభిమానులు చేసిన ఈ అరాచకానికి సుమారు రూ. 20 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)