ఎన్టీఆర్ అభిమానులకు దర్శకుడు కొరటాల శివ ఊహించని సర్‌‌ప్రైజ్ ఇచ్చారు. యంగ్ టైగర్ హీరోగా తాను తెరకెక్కిస్తున్న దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్టు ఎక్స్ వేదికగా వెల్లడించారు. తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రానుందని మరోసారి గుర్తు చేశారు. సినిమాలో ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నందున రెండు భాగాలుగా తీయాల్సి వస్తోందని చెప్పారు.

‘దేవర’ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేది కావడంతో కథ విషయంలో ఎన్టీఆర్ సహా మేమంతా ఉద్వేగానికి లోనయ్యాం. ఇందులో బలమైన పాత్రలెన్నో ఉన్నాయి. ఎంతో ఉత్సాహంగా చిత్రీకరణ ప్రారంభించిన తరువాత ఆ ప్రపంచం రోజురోజుకూ పెద్దదైపోయింది. కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ ఔట్‌పుట్‌తో మాలో రెట్టింపు ఉత్సాహం కలిగింది. నిడివిని దృష్టిలో పెట్టుకుని ఒక్క సన్నివేశం, ఒక్క సంభాషణ కూడా తొలగించలేమని అంతా ఫీలయ్యాం.

ఒక్క పార్ట్‌లో ఇంత పెద్దకథను ముగించేయడం తప్పు అన్న నిర్ణయానికి వచ్చాం. పాత్రలు, వాటి భావోద్వేగాలను పూర్తిస్థాయిలో చూపించాలంటే ఒక్క పార్ట్‌లో కుదరదనుకున్నా. అందరితో చర్చించి పార్ట్ 2 నిర్ణయం తీసుకున్నా’’ అని వివరించారు. అంతగా అభివృద్ధి చెందని ఓ తీర ప్రాంతం నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ చిత్రంతో తొలిసారిగా దక్షిణాదిలో కాలుపెడుతోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

Devara

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)