టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో తెర‌కెక్కిన శ్రీమంతుడు మూవీ 2015 ఆగ‌ష్టు 07న విడుద‌లై సంచ‌ల‌న విజయం సాధించిన సంగతి విదితమే.ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 140 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఈ మూవీ యూట్యూబ్‍లో రికార్డు సృష్టించింది. తాజాగా ఈ మూవీ యూట్యూబ్‍లో 200 మిలియన్స్ (20కోట్ల) వ్యూస్‍ దాటిన‌ట్లు మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. యూట్యూబ్‍లో 200 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న తొలి తెలుగు చిత్రంగా శ్రీమంతుడు రికార్డు కొట్టింది. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో ఫుల్ ఖుషి అవుతున్నారు.

Mahesh Babu Srimanthudu Movie Sets A New Record on YouTube

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)