హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా కలిసారు. గురువారం రాత్రి ప్రజాభవన్‌కు వచ్చిన చిరంజీవి దంపతులకు కుటుంబసభ్యులతో కలిసి భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం, శాలువాతో వారిని సత్కారించారు. చిరంజీవి కూడా భట్టి విక్రమార్కను శాలువాతో సత్కరించారు. భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు సూర్య విక్రమాదిత్య చిరంజీవి దంపతులకు ఆత్మీయ ఆతిథ్యం పలికారు. కాగా, తెలంగాణ కొత్త మంత్రులను ఒక్కొక్కరిని మెగాస్టార్ కలుస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)