మాలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కైతప్రమ్‌ విశ్వనాథన్‌ నంబూద్రి (58) (Kaithapram Viswanathan Dies) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. విశ్వనాథన్‌కు భార్య గౌరి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విశ్వనాథన్‌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మ్యూజిక్‌ టీచర్‌గా కెరీర్‌ ప్రారంభించి కన్నకి, తిలక్కం సహా 20కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన చేసిన సేవలకు గాను గానభూషణం అనే బిరుదును సైతం సంపాదించుకున్నారు. 'కన్నకి' చిత్రానికి గాను 2001లో కేరళ ప్రభుత్వం స్టేట్‌ అవార్డుతో ఆయన్ని సత్కరించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)