సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నర్సులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దూమరం రేపుతున్న సంగతి విదితమే. అన్‌స్టాపబుల్‌ అనే కార్యక్రమంలో జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కళ్యాణ్‌తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నర్సులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నర్సులు నిరసనలు తెలుపుతున్నారు.బాలకృష్ణ తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. కరోనా సమయంలో కుటుంబాలను వదిలి, ప్రాణాలకు తెగించి సేవ చేశాము. నర్సింగ్‌ ప్రొఫెషన్‌ను తక్కువ చేసి చూడకండి అని కోరారు. తన వ్యాఖ్యలపై తాజాగా బాలకృష్ణ వివరణ ఇచ్చారు. నా వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. రోగులకు సేవలు అందించే నర్సులంటే తనకు గౌరవం అని తెలిపారు. నర్సుల మనోభావాలు దెబ్బతిస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను అంటూ కామెంట్స్‌ చేశారు.

Here's Updates

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)