రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం ప్రాజెక్ట్ K ఫస్ట్ లుక్ విడుదలైంది. ఐరన్ మ‍్యాన్ పోజులో ఉన్న ఈ లుక్‌లో ప్రభాస్ తల వేరే ఎవరి శరీరానికో అతికించినట్లు ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే 'మహానటి' లాంటి టిపికల్ స్క్రిప్ట్‌ని తీసిన నాగ్ అశ్విన్ ఈ సినిమాకి డైరెక్టర్ కావడం, ఒక్క లుక్‌తో మూవీ స్టేటస్ ఎలా డిసైడ్ చేస్తారు అనేది కొందరి వాదన.

అయితే ఇంకా 'ప్రాజెక్ట్ K' టైటిల్ కూడా రివీల్ చెయ్యలేదు. ప్రస్తుతం చిత్రబృందం అమెరికాలో ఉంది. గురువారం జరిగే కామికాన్ ఈవెంట్‌లో టైటిల్ ఏంటనేది బయట పెట్టబోతున్నారు. అలాగే ఈ సినిమా నుంచి గ్లింప్స్ వీడియో వస్తుంది. అవి ఈ సినిమా గురించి పూర్తి డీటైలింగ్ ఇస్తాయి. ఏది ఏమైనా ఈ మధ్య ప్రభాస్ ప్రతి సినిమా ప్రమోషనల్ మెటీరియల్, ఫస్ట్ లుక్ లాంటివి ఫ్యాన్స్‌ని నిరాశపరుస్తుండటం కాస్త వింతగా అనిపిస్తుంది.

ఇక ఈ మధ్య వచ్చిన 'ఆదిపురుష్' గురించి మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు అనుకుంటా. ఈ మూవీకి అయితే ఫస్ట్ లుక్ నుంచి థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత కూడా ఘోరమైన ట్రోలింగ్ జరిగింది

prabhas-iron-man

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)