Hyderabad, Dec 31: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. ఈ క్రమంలో, వివిధ పార్టీలు, రంగాలకు చెందినవారితో అల్పాహార సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పవన్ ను కలిశారు. ఆయనతో సెల్ఫీ దిగి ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను గద్వాల్ విజయలక్ష్మి ట్విట్టర్ లో పంచుకున్నారు. కాగా, హైదరాబాదులో రాష్ట్రపతి శీతాకాల విడిది నేటితో ముగిసింది. ఈ మధ్యాహ్నం హకీంపేట వైమానిక స్థావరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమయ్యారు.

డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. కారుపైకి దూసుకెళ్లిన బస్సు.. 9 మంది దుర్మరణం.. 28 మందికి గాయాలు.. గుజరాత్‌లో ఘటన

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)