ఏపీ ప్రభుత్వం టాలీవుడ్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ ధరలపై చాన్నాళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ సినిమా టికెట్ ధరలపై కొత్త జీవో జారీ చేసింది. ఏపీలోని సినిమా థియేటర్లలో టికెట్ల ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సినీ ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేస్తోంది. తాజాగా సీఎం జగన్, మంత్రి పేర్నినానికి ధన్యవాదాలు తెలుపుతూ హీరో ప్రభాస్ ట్వీట్ చేశారు. తెలుగు సినీ వర్గాల ఆందోళనలు అర్ధం చేసుకుని సవరించిన టికెట్ ధరలతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఆదుకున్నారని తెలిపారు. టికెట్ల ధరల పెంపుపై మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్‌లో స్పందించారు.

ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమా టికెట్ల రేట్లను సవరించినందుకు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. చిన్న సినిమాలకు ఐదో షోకి అనుమతినివ్వడం నిర్మాతలకు మేలు చేస్తుందన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)