రెబల్ స్టార్ ప్రభాస్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే జంటగా రూపొందిన సినిమా 'రాధే శ్యామ్'. 'జిల్' ఫేమ్ కె.కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మిస్తున్నారు. సినిమాలో రెండు సాంగ్స్(ఈ రాతలే..., నగుమోము తారలే)ను ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇప్పుడు మూడో సాంగ్ 'సంచారి' టీజర్‌ను విడుదల చేశారు.
దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా... హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. 'సంచారి' పాటకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా... అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. 'చలో... చలో... సంచారి! చల్ చలో... చలో! చలో... చలో... సంచారి! చల్ చలో... చలో... కొత్త నేలపై' అంటూ పాటను కృష్ణకాంత్ (కెకె) రాశారు. సినిమాలో హీరో ట్రావెలింగ్ చేసే సమయంలో వచ్చే పాటలా ఉంది ఇది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)