రెండేళ్ల కిందట విడుదలైన పుష్ప’. బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు రెండో భాగం రెడీ అవుతోంది. బాక్సాఫీస్ ను ‘రూల్’ చేసేందుకు ‘పుష్ప: ది రూల్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ‘భన్వర్ సింగ్ షెకావత్’.. అదేనండీ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ తో కీలక షెడ్యూల్ ను పూర్తి చేశారట. ఈ మేరకు షూటింగ్‌ లొకేషన్‌లో డైరెక్టర్ సుకుమార్, ఫహాద్‌ మానిటర్‌ స్క్రీన్‌ను చూస్తున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘ఈ సారి ఆయన ప్రతీకారంతో తిరిగి వస్తాడు’ అనే ట్యాగ్‌లైన్‌ను కూడా జత చేశారు. పుష్పలో బన్నీ తర్వాత ఆ స్థాయిలో మెరిసిన పాత్ర భన్వర్‌సింగ్‌ షెకావత్‌దే.

Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)