పాన్‌ ఇండియా మూవీ రాధేశ్యామ్‌ ప్రమోషన్స్‌ జోరు పెంచింది. వరుసగా పాటలు రిలీజ్‌ చేస్తూ హైప్‌ పెంచుతున్న సినిమా టీమ్‌ తాజాగా సీనియర్‌ నటుడు కృష్ణంరాజు లుక్‌ను రిలీజ్‌ చేసింది. పరమహంస పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నట్లు పోస్టర్‌ ద్వారా అధికారికంగా వెల్లడించింది. మహాజ్ఞాని అయిన పరమహంస పాత్ర కోసం ఆయన ఏడాదిగా గడ్డం పెంచారు. కృష్ణం రాజు, ప్రభాస్‌తో కలిసి 'బిల్లా', 'రెబల్'‌ సినిమాల్లో కలిసి నటించారు. ఆయన చివరిసారిగా 2015లో వచ్చిన 'రుద్రమదేవి' చిత్రంలో గణపతి దేవుడుగా కనిపించారు. ఇన్నేళ్ల గ్యాప్‌ తర్వాత రాధేశ్యామ్‌లో నటిస్తున్నారు. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)