Hyderabad, March 18: మెగా పవర్ స్టార్ (Mega Power star) రామ్ చరణ్ (Ram charan) ఆస్కార్ (Oscar) ఈవెంట్ తర్వాత హైదరాబాద్ (Hyderabad) తిరిగి చేరుకున్నారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లోని బేగమ్ పేట్ ఎయిర్‌పోర్టు చేరుకున్న చరణ్‌కు వందలాదిగా తరలివచ్చిన మెగా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటునాటు సాంగ్‌కు ఆస్కార్ పురస్కారం లభించింది. ఈ ఈవెంట్ తర్వాత చరణ్ అమెరికా నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో అమిత్‌షాతో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ భేటీ అయ్యారు. అక్కడి నుంచి చరణ్ కుటుంబ సమేతంగా హైదరాబాద్ చేరుకున్నారు. అభిమానుల భారీ ర్యాలీ మధ్య రామ్‌చరణ్ ఇంటికి వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి.
Night time lo kuda haaaa croud chudu thammudu 🥵❤️🔥 @AlwaysRamCharan bosssu ❤️🔥 #INDIAsPrideRAMCHARAN #GlobalStarRamCharanpic.twitter.com/Sfu0u2gv4z
— Babu goud (@RC_MSD_) March 18, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)