టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్యం విషమంగా ఉందని కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం కృష్ణ ఆరోగ్యం విషమంగానే ఉంది. సుమారు మధ్యరాత్రి సమయంలో గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే ఎమర్జెన్సీలో చికిత్స ప్రారంభించాం. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. వెంటిలెటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ఆయనకు ఎటువంటి చికిత్స ఇవ్వాలో అదే చేస్తున్నాం. మరో 24 గంటలు ఆయనను వైద్యుల పర్యవేక్షణలో ఉంచాల్సి ఉంది’ అని వైద్యులు చెప్పారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)