ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన 'కేజీఎఫ్‌ 2' మేనియా కనిపిస్తోంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు హీరో యశ్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌ 14న వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌కు, యశ్‌ యాక్టింగ్‌, యాక్షన్‌కు ఫిదా అవుతున్నారు. అన్ని భాషల్లో ఈ చిత్రం కోట్ల రూపాయలు కొల్లగొడుతోంది.

తాజాగా కేజీఎఫ్‌ చూసిన కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన స్పందనను తెలిపారట. ఈ మూవీతో భారీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందించారంటూ కేజీఎఫ్‌ టీంను స్పెషల్‌గా ఆయన అభినందించారని విశ్లేషకుడు మనోబాల ట్వీట్‌ చేశాడు. రజనీ స్యయంగా కేజీఎఫ్‌ నిర్మాతకు ఫోన్‌ చేసి మూవీ బాగుందని ప్రశంసించినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)