రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రిలో చేరినట్టు వారు చెప్పారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డీఎండీకే ఓ ప్రకటనలో పేర్కొంది. ఒకటి రెండు రోజుల చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అవుతారని కూడా డీఎండీకే వర్గాలు తెలిపాయి.

గత కొద్దికాలంగా విజయ కాంత్ పలు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2020 సెప్టెంబర్‌లో విజయకాంత్ కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్చి అయ్యారు. విజయకాంత్ తర్వాత ఆయన భార్య ప్రేమలత కూడా కోవిడ్ బారిన పడి, అక్టోబర్ 2న ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయ్యారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)