డీఎండీకే అధినేత,​ నటుడు విజయ్‌కాంత్​ (71) అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఆయన పార్థివదేహానికి కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు ఆశ్రునయనాలతో కెప్టెన్ అంతిమయాత్ర ముగిసింది.

కాగా.. మొదట విజయ్‌కాంత్‌ భౌతికకాయాన్ని డీఎండీకే కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత విజయకాంత్‌ పార్థివదేహాన్ని చెన్నైలోని తీవు తిడల్‌కు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. అక్కడే సినీస్టార్ కమల్​ హాసన్​, రజనీకాంత్​ ఆయనకు నివాళులు అర్పించారు. విజయకాంత్‌ చివరి చూపు కోసం సామాన్య ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. అనంతరం డీఎండీకే ప్రధాన కార్యాలయానికి పార్థివదేహాన్ని తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కెప్టెన్‌ విజయకాంత్‌(71) డిసెంబర్‌ 28న అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి విదితమే.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)