మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్‌ను వెల్లడించారు.గతేడాది దసరా రోజున ‘విశ్వానికి మించి..’ అనే ఆసక్తికరమైన పోస్టర్‌తో ఈ చిత్రాన్ని ప్రారంభించగా.. నేడు సంక్రాంతి సందర్భంగా విశ్వంభర టైటిల్‌ను ప్రకటించారు. ఈ మేరకు ఓ కాన్సెప్ట్‌ వీడియోను పంచుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా రగ్బీ ఆకారం లాంటి ఓ వస్తువు.. పలు లోకాల్లో ప్రయాణించడాన్ని ఈ కాన్సెప్ట్ వీడియోలో చూపించారు.

వీడియో ఆధారంగా చూస్తే ఇదో సోషియో ఫాంటసీ మూవీ అని అర్థమవుతోంది. ‘బింబిసార’ వంటి సూపర్‌ హిట్‌ తర్వాత వశిష్ఠ దర్శకత్వంలో రానున్న సినిమా కావడం.. మెగా స్టార్‌ హీరోగా తెరకెక్కుతుండడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి.ఇందులో చిరు సరసన అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్‌ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నారు. దీనితో పాటు చిరంజీవి తన కుమార్తె సొంత నిర్మాణ సంస్థ ‘గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’పై 157వ సినిమా చేయనున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)