దేశంలో అన్ని యూనివర్శిటీలు, కాలేజీలకు ఎగ్జామినేషన్, అకాడమిక్ క్యాలెండర్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) విడుదల చేసింది. కరోనావైరస్ ముప్పు కారణంగా గత విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా మారి పరీక్షలు అనుకున్న సమయానికి జరగలేదు. దీంతో యూజీసీ ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని గాడిలో పెట్టేందుకు అన్ని యూనివర్శిటీలకు మార్గదర్శకాలను విడుదల చేసింది.
యూజీసీ ఆదేశాల ప్రకారం 2021- 22 విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ కోర్సులలో ప్రవేశాలను సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేయాల్సివుంటుంది. అక్టోబరు ఒకటి నుంచి అకాడమిక్ సెషన్ ప్రారంభించాల్సివుంటుంది. పరీక్షలను ఆన్ లైన్, ఆఫ్‌లైన్, మిశ్రమ విధానాల్లో నిర్వహించాల్సివుంటుంది. కాగా యూజీసీ కోర్సులలో అడ్మిషన్ కోసం 12వ తరగతి బోర్టు పరీక్షా ఫలితాలు వెల్లడికావాల్సివుంటుంది. ఈ ఫలితాలు జూలై 31 నాటికల్లా విడుదల కానున్నాయి.
UGC Guidelines on Examinations and Academic Calendar in view of the COVID-19 Pandemic – July, 2021->https://t.co/zLqFndjO9k@dpradhanbjp @EduMinOfIndia @PIBHRD @ANI @DDNewslive pic.twitter.com/CArPzn7RaB
— UGC INDIA (@ugc_india) July 16, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)