Newdelhi, June 20: భారత ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తొలి అధికారిక అమెరికా పర్యటన (USA Visit) ప్రారంభమైంది. నేడు ఉదయం ఆయన ఢిల్లీ (Delhi) నుంచి విమానంలో (Plane) అమెరికాకు బయలుదేరారు. ప్రయాణం ప్రారంభించే ముందు ఆయన తన పర్యటనకు సంబంధించిన వివరాలను ట్వీట్ చేశారు. ట్వీట్‌లోని వివరాల ప్రకారం.. మోదీ న్యూయార్క్, వాషింగ్టన్ నగరాల్లో పర్యటించనున్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే యోగా దినోత్సవంలో కూడా పాల్గొంటారు. పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమవుతారు. అమెరికా ఉభయసభలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా అమెరికాలోని భారత సంతతి వ్యాపారవేత్తలు, రాజకీయనాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో కూడా ప్రధాని మోదీ సమావేశమవుతారు.

Purnananda Swamy: పదిహేనేండ్ల బాలికపై రెండేళ్లుగా పూర్ణానంద స్వామీజీ అత్యాచారం.. బాలికను గొలుసులతో తన గదిలో బంధించి అఘాయిత్యం.. పనిమనిషి సాయంతో ఆశ్రమం నుంచి తప్పించుకున్న బాలిక.. అర్ధరాత్రి స్వామీజీ అరెస్ట్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)