Hyderabad, Oct 7: వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా తెలంగాణ (Telangana) రోజురోజుకు వేడెక్కుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఫిబ్రవరి, మార్చిలో ఉన్న వాతావరణం నెలకొని ఉంది. వచ్చే పది రోజులు కూడా ఇలాంటి వాతావరణమే ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. వాతావరణం వేడెక్కడంతో ప్రజలు తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడుతున్నారు. దీనికితోడు వేడిగాలులు (Heatwaves) ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో తుపాన్లు వస్తుంటాయి. అవి వస్తే తప్ప వాతావరణం చల్లబడే అవకాశం లేదని వాతావరణశాఖ అభిప్రాయపడింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ఇప్పటికే ప్రారంభమైందని తెలిపింది. తెలంగాణలో ప్రస్తుతం 32 డిగ్రీలు, ఆపై ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)