జమ్మూకశ్మీర్‌లోని సుంజ్వాన్ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సైన్యం గుర్తించింది. ఉగ్రవాదుల కోసం గురువారం రాత్రి అక్కడ బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఓ జవాను ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు జమ్మూ జోన్ ఏడీజీపీ ముఖేష్ సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాదుల కోసం కూంబింగ్ కొనసాగుతోందని సింగ్ తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు భద్రతా బలగాలు తెలిపాయి.
#UPDATE | J&K: Till now 2 terrorists have been killed, 2 AK-47 rifles, arms & ammunition, satellite phones & some documents were recovered. It seems like they were 'Fidayeen' attackers. Operation is underway: Mukesh Singh, ADGP, Jammu zone pic.twitter.com/Ggt5G6wTTl
— ANI (@ANI) April 22, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)