Hyderabad, March 25: అహింసా వాది మహాత్మాగాంధీకి (Mahatma Gandhi) డిగ్రీ (Degree) లేకపోయినా విద్యాధికుడిగా కనిపిస్తారని, జాతిపిత అయ్యారని జమ్ముకశ్మీర్ (JammuKashmir) ఎల్జీ మనోజ్ సిన్హా వ్యాఖ్యానించారు. గ్వాలియర్‌లోని ఐటీఎమ్ వర్సిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘డిగ్రీ పొందడమే చదువుకున్నట్టు’ కాదని అర్థం వచ్చేలా ఆయన ప్రసంగించారు. ‘చాలా మంది గాంధీజీకి న్యాయ శాస్త్ర డిగ్రీ ఉందనుకుంటారు. ఆయన విద్యార్హత హై స్కూల్ డిప్లొమా మాత్రమే. ఆయన లా ప్రాక్టీస్‌కు అర్హత సాధించారు కానీ ఆయనకు డిగ్రీ లేదు. మీకు మార్క్ ట్వెయిన్ గురించి తెలుసా?’ అని సిన్హా అన్నారు. సిన్హా వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.
‘Mahatma Gandhi didn't have law degree, his qualification was…': Manoj Sinha | Latest News India | Times Of Ahmedabad #Gujarat #Ahmedabadhttps://t.co/Pw9LiMuFUN
— Times Of Ahmedabad (@ahmedabad_times) March 24, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)