Rajkot, FEB 26: గుజరాత్ లోని రాజ్ కోట్ (Rajkot) పరిసర ప్రాంతాల్లో భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.3గా (4.3 Magnitude) నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రాజ్‌ కోట్ కు 270 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3.21 నిమిషాలకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్‌మొలాజి (NCS) ప్రకటించింది. భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉంది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల టర్కీ, సిరియాల్లో భూకంపం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గుజరాత్ కు భూకంప ముప్పు ఉందన్న వార్తలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)