Delhi Coronavirus: ఆక్సిజన్ లేదు..కొత్త పేషెంట్లు మా ఆస్పత్రికి రాకండి, దేశ రాజధాని ఢిల్లీలో ఆస్పత్రి ఎదుట కనిపిస్తున్న బోర్డులు, ఎయిమ్స్‌లోనూ ఆక్సిజన్ కొరత కారణంగా కొత్త కరోనా రోగులకు నో ఎంట్రీ
దేశరాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ నిల్వలు అడుగంటుతుండటంతో కరొనా భాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆక్సిజన్ కొరత నేపధ్యంలో పలు ఆసుపత్రులలో కరోనా బాధితులను చేర్చుకోవడం లేదు. దీంతో బాధితులు ప్రాణాలను ఉగ్గబట్టుకుని పలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
ఢిల్లీలోని జీటీబీ, సరోజ్, జైపూర్ గోల్డెన్, మెట్రో, సర్ గంగారామ్, ఫోర్టీస్ ఎస్కోర్ట్ తదితర ఆసుపత్రులలో కొత్తగా కరోనా బాధితులను చేర్చుకోవడం లేదు. ఇదేవిధంగా చిన్న స్థాయి నర్సింగ్ హోమ్‌లలోనూ కొత్తగా కరోనా బాధితులెవరినీ చేర్చుకోవడం లేదు. పైగా బాధితులు ఇంటిలోనే తగిన రీతిలో వైద్య చికిత్స పొందాలని ఆయా ఆసుపత్రుల వైద్యులు సూచిస్తున్నారు. ఢిల్లీలో పెద్దాసుపత్రిగా పేరొందిన ఎయిమ్స్ లోనూ ఆక్సిజన్ కొరత కారణంగా కొత్తగా కరోనా బాధితులెవరినీ చేర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.
Things are turning very grim. This is the situation of my hospital Fortis Escorts Heart Institute, at N. Delhi. One of the most premier cardiac hospital of India. @SanjogKalra @NitiCardio @Suhelseth @RemaNagarajan @PMOIndia @AmitShah @mmamas1973 @mirvatalasnag @CMichaelGibson pic.twitter.com/UvlrkNrOmM
— 𝔻𝕣 ℕ𝕚𝕤𝕙𝕚𝕥𝕙 ℂ𝕙𝕒𝕟𝕕𝕣𝕒 (@NishithChandra) April 24, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 25, 2021 02:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

