అగ్నిప‌థ్ రిక్రూట్‌మెంట్ స్కీంపై నిర‌స‌న‌లు మిన్నంటిన నేప‌థ్యంలో అగ్నివీరుల భ‌విష్య‌త్‌కు ఢోకా ఉండ‌ద‌ని, వారి భ‌విష్య‌త్‌పై ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ భ‌రోసా ఇచ్చారు. రెగ్యుల‌ర్ స‌ర్వీసులోకి తీసుకునే అగ్నివీరుల‌కు క‌ఠోర శిక్ష‌ణ ల‌భిస్తుంద‌ని, నిర్ధిష్ట కాలంలో మెరుగైన అనుభ‌వం సాధిస్తార‌ని చెప్పారు. అగ్నివీరుల భ‌విష్య‌త్ పూర్తిగా భ‌ద్ర‌మేన‌ని హామీ ఇచ్చారు. అగ్నిప‌థ్ స్కీంను స‌మ‌ర్ధించిన అజిత్ దోవ‌ల్ యువ‌, సుశిక్షిత సేన‌లు సైన్యానికి అవ‌స‌ర‌మ‌ని అన్నారు. అగ్నిప‌థ్ నిర‌స‌న‌ల‌పై స్పందిస్తూ హింసాత్మ‌క నిర‌స‌న‌ల విష‌యంలో నిందితుల‌ను గుర్తించార‌ని, విచార‌ణ జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)