తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. ఈ క్రమంలో ఓ బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగు పడి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

టపాసుల దుకాణంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఆగంతకుడు, యజమాని అప్రమత్తతో తప్పిన ప్రమాదం...పోలీసుల అదుపులోకి దాడికి పాల్పడ్డ వ్యక్తి..వీడియో ఇదిగో

ఉండ్రాజవరం మండలం సూర్యరావు పాలెం గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పిడుగు దాటికి బాణాసంచా తయారీ కేంద్రంలో షార్ట్‌ సర్క్యూట్ అయ్యింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. కూలీలు ప్రాణభయంతో సమీపంలోని అరటి తోటల్లోకి పరిగెత్తారు. బాణాసంచా తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది. మరణించిన ఇద్దరు మహిళలు బాణాసంచా తయారీ కేంద్రంలో పని చేసే వారిగా తెలుస్తోంది. గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Fireworks factory caught fire due to lightning 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)