అపోలో జేఎండీ సంగీతారెడ్డికి రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కరోనావైరస్ సోకింది. జూన్‌ 10న తాను కోవిడ్‌-19 బారిన పడ్డానని, వ్యా‍క్సిన్‌ తీసుకుని.. ఎన్ని జాగ్రత్తలు పాటించినా తనకు కరోనా సోకడం షాక్‌కు గురి చేసిందని సంగీతారెడ్డి ట్వీట్‌ చేశారు. వ్యాధినిర్ధారణ, చికిత్స రెండూ కీలకమైన అంశాలని తెలిపారు. కరోనా వల్ల విపరీతమైన జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరానని ఆమె తెలిపారు. అయితే కాక్టెయిల్, రీజెనెరాన్ థెరపీద్వారా కోలుకుంటున్నాను అన్నారు. వ్యాక్సిన్‌ కరోనాను అడ్డుకోలేదు...కానీ వైరస్‌ ప్రభావం తీవ్రం కాకుండా నిరోధిస్తుందని సంగీతారెడ్డి తెలిపారు. అందువల్ల వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు మరవొద్దు అని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన డాక్టర్లు, నర్సులకు కృతజ్ఞతలు తెలిపారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)