లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఈడీ తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు.. కేజ్రీవాల్‌ను ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. కాగా, లిక్కర్ స్కాం కేసులో గత రాత్రి ఈడీ తనను అరెస్టు చేసిన కేసులో బెయిల్ కోరుతూ.. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు నుంచి ఆయన ఉపసంహరించుకున్నారు. ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు ఢిల్లీ సీఎం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.  అరెస్ట్ తర్వాత తొలిసారిగా స్పందించిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, జైలులో ఉన్నా బయట ఉన్నా నా జీవితం దేశానికే అంకితమని వెల్లడి

అరెస్ట్ అయిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తన జీవితం దేశానికి అంకితం (My Life Dedicated To Nation) అని అన్నారు (Arvind Kejriwal)‌. మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్‌ తర్వాత ఆయన తొలిసారి మాట్లాడారు. ఎక్కడ ఉన్నా దేశం కోసం పనిచేస్తుంటానని పేర్కొన్నారు.ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులోకి వెళుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)