ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో . ఒళ్లు జలదరింపజేసే ఈ ప్రమాదం జరిగింది. రెండు లారీల మధ్య చిక్కుకున్న ఒక కారు నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో కారు డ్రైవర్ మరణించాడు. పలాసుని ప్రాంతంలోని జాతీయ రహదారి 16 వద్ద సోమవారం ఉదయం ట్రాఫిక్ సిగ్నల్ పడింది. దీంతో పలు వాహనాలు బారులు తీరాయి. ఒక లారీ వెనుక రెండు కార్లు ఆగి ఉన్నాయి. ఇంతలో లోడ్‌తో ఉన్న మరో లారీ వేగంగా ముందుకు వచ్చి ఆగిన కార్లపైకి దూసుకెళ్లింది. వైట్ కారు రోడ్డు డివైడర్ వైపునకు వెళ్లగా లారీ వెనుక ఉన్న నీలం రంగు కారు రెండు లారీల మధ్య ఇరుక్కుని నుజ్జునుజ్జైంది. సీసీటీవీలో రికార్డైన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
Absolutely horrific accident on the NH16 in Palasuni, Bhubaneswar today. Traffic at a standstill. Notice the blue car. pic.twitter.com/669Ytg0u8N
— Samiran Mishra (@scoutdesk) April 4, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)