CBI arrests railway officer in UP for taking Rs 3 lakh bribe: గోరఖ్‌పూర్‌లో నార్త్ ఈస్టర్న్ రైల్వే (ఎన్‌ఇఆర్) ప్రిన్సిపల్ చీఫ్ మెటీరియల్ మేనేజర్ కెసి జోషిని అవినీతి ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, నోయిడాలోని అతని అధికారిక నివాస ప్రాంగణాల్లో నిర్వహించిన సోదాల్లో దర్యాప్తు సంస్థ సుమారు రూ.2.61 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది.
ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ (ఐఆర్‌ఎస్‌ఎస్) 1988 బ్యాచ్‌కు చెందిన ఈ అధికారి సీబీఐ రహస్య ఆపరేషన్‌లో రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.రైల్వేకు ట్రక్కులు సరఫరా చేసే ఓ సంస్థ యజమాని నుంచి రూ.7 లక్షలు లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలతో సదరు అధికారిపై కేసు నమోదైంది.లంచం చెల్లించని పక్షంలో ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (జిఇఎమ్) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని ఫిర్యాదుదారు సంస్థను బెదిరించారు.దీంతో బాధితుడు సీబీఐని ఆశ్రయించడంతో స్పందించిన సీబీఐ వల వేసి నిందితుడు లంచం తీసుకుంటుండగా విజయవంతంగా పట్టుకుంది.తదుపరి చట్టపరమైన చర్యల కోసం రైల్వే అధికారిని లక్నోలోని కోర్టు ముందు హాజరుపరిచారు.
Here's News
गोरखपुर
➡️CBI टीम ने केसी जोशी को गिरफ्तार किया
➡️केसी जोशी के घर से 2.61 करोड़ बरामद
➡️गोरखपुर में रेलवे के प्रिंसिपल चीफ मैनेजर हैं जोशी
➡️जोशी के गोरखपुर आवास पर कल CBI ने छापा मारा था
➡️सीबीआई के छापे में कई बोरों में भरा पैसा मिला
➡️जोशी के घर से 2.61 करोड़ नगद बरामद… pic.twitter.com/EycVwZiVJt
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) September 13, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)