కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాలు స్వాధీనం చేసుకుంది కోర్టు(Nirmal Court). నిర్మల్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో నిర్మల్ జిల్లా కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాలను నిర్మల్ కోర్టు స్వాధీనం చేసుకుంది(Court Seizes Collector Office).

1999 లో గడ్డెన్న, శ్రీరాంసాగర్ జలాశయంలో భూములు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదు. బాధితులకు కలెక్టరేట్ నుండి రూ. 6,79,63,102 కోట్లు, ఆర్డీఓ నుండి రూ. 1,45,46,927 కోట్ల పరిహారం రావాల్సి ఉండగా జాప్యం జరిగింది.

 తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్తరేషన్‌ కార్డుల పంపిణీ, ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్

దీంతో భాధితులు కోర్టును ఆశ్రయించారు. సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాలు స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు కోర్టు అధికారులు కార్యాలయాలను స్వాధీనం చేసుకున్నట్లు నోటీసులు అందజేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)