సీబీఐకి స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తితో స్వేచ్ఛ‌ను ప్ర‌సాదించాల‌ని మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరింది. ఎన్నిక‌ల క‌మిష‌న్‌, కాగ్ త‌ర‌హాలో సీబీఐకి విస్తృత అధికారాలు క‌ల్పించేలా చ‌ట్టం తీసుకురావాల‌ని స్ప‌ష్టం చేసింది. సీబీఐకి వ‌న‌రులు, సిబ్బంది ప‌రిమితంగా ఉండ‌టంతో విచార‌ణ చేప‌ట్టాల్సిన అవ‌స‌రం త‌లెత్తిన‌ప్పుడు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ త‌ట‌ప‌టాయిస్తోంద‌ని పేర్కొంది. ప‌రిమిత వ‌నరుల‌తో అది ద‌ర్యాప్తును చేప‌ట్ట‌లేక‌పోతోద‌ని, న్యాయ‌స్ధానాల ఎదుట సీబీఐ త‌న లోటుపాట్ల‌ను ఏక‌రువు పెట్ట‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైంద‌ని జ‌స్టిస ఎన్ కిరుబ‌క‌ర‌న్‌, జ‌స్టిస్ పుగ‌లేందితో కూడిన డివిజ‌న్ బెంచ్ పేర్కొంది.

సీబీఐకి ప్ర‌త్యేకంగా బ‌డ్జెట్ కేటాయింపులు చేప‌ట్టాల‌ని మ‌ద్రాస్ హైకోర్టు న్యాయ‌మూర్తులు కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించారు. డిప్యుటేష‌న్‌పై ఆధార‌ప‌డ‌కుండా సీబీఐ కోసం ప్ర‌త్యేకంగా ప‌నిచేసే అధికారులు ఉండాల‌ని స్ప‌ష్టంచేశారు. నిధులు, సౌక‌ర్యాల లేమి వంటి ప‌లు అవ‌రోధాల‌ను అధిగ‌మిస్తూ సీబీఐ ప‌నిచేస్తోంద‌ని కోర్టు పేర్కొంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)