హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఊరేగింపులు, వేడుకల సందర్భంగా విపరీత శబ్ద కాలుష్యానికి దారితీస్తున్న డీజేలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు డయల్ 100కు ఫిర్యాదులు పెరిగాయి. ఈ క్రమంలో డీజేలపై నిషేధం విధిస్తూ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

వీడియో ఇదిగో, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, మద్యం సేవించిన యువకులను చితకబాదిన స్థానికులు

నగర సీపీ సీవీ ఆనంద్ ఇటీవల డీజే అంశంపై బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ రూంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. డీజేలపై నియంత్రణ అవసరాన్ని వివరిస్తూ సీవీ ఆనంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండేళ్ళుగా డీజేలతో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘన సాగుతోందని అన్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)