తమిళనాడు చెందిన ఇద్దరు వ్యక్తులు మంగళ, బుధవారాల్లో దుబాయ్‌, చైనా నుంచి స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో దిగిన అనంతరం వారికి టెస్టులు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో, వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించారు. బుధవారం ఉదయం దుబాయ్‌కి చెందిన ఇద్దరు వ్యక్తులు చైన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కరోనా టెస్టుల సందర్బంగా వీరికి పాజిటివ్‌గా తేలింది.

దీంతో​, తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులు నలుగురి శాంపిల్స్‌ను జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌కు పంపినట్టు తెలిపారు.మరోవైపు..కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంటటంతో న్యూ ఇయర్ వేడుకలపై స్టాలిన్ సర్కారు ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)