ఢిల్లీ మద్యం పాలసీ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2న విచారణకు హాజరుకావాలని నోటీసులు కోరింది. లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఏప్రిల్‌లో కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా ఈడీ సైతం విచారణకు పిలిచింది.ఇదే కేసులో ప్రస్తుతం ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్‌ను ఇవాళ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆరు నుంచి ఎనిమిది నెలల్లో కేసు విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది. విచారణ ఆలస్యమైతే సిసోడియా మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది.
Here's ANI Tweet
ED summons Arvind Kejriwal in Delhi excise policy case
Read @ANI Story | https://t.co/Kgfo7wcoGN#ArvindKejriwal #EnforcementDirectorate #LiquorScam #ED #Delhiexcisepolicycase pic.twitter.com/uDaQkKqonH
— ANI Digital (@ani_digital) October 30, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)