దేశంలో ఈ రోజు నాలుగు రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది. ఆగ్నేయంలో తమిళనాడు, నైరుతిలో కర్ణాటక, వాయవ్యంలో గుజరాత్, ఈశాన్యాన మేఘాలయ రాష్ట్రాల్లో నేడు భూప్రకంపనలు వచ్చాయి. మొదట కర్ణాటకలో ఉదయం 6.52 గంటలకు భూమి కంపించింది. రాష్ట్రంలోని విజయపురలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రత నమోదైంది.

ఆ తర్వాత మరో 45 నిమిషాల వ్యవధిలో తమిళనాడులోని చెంగల్పట్టులో భూకంపం చోటుచేసుకుంది. ఇక్కడ 3.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. అనంతరం మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో ఉదయం 8.46 గంటలకు భూకంపం రాగా, ఉదయం 9 గంటలకు గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి. షిల్లాంగ్ లో 3.8 తీవ్రత నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వివరాలు తెలిపింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)