Gandhi Nagar, Feb 27: గుజరాత్‌ రాష్ట్రాన్ని వరుసగా స్వల్ప భూకంపాలు వణికిస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 3:21 గంటల ప్రాంతంలో 4.3 తీవ్రతతో రాజ్‌కోట్‌ (Rajkot) ప్రాంతంలో భూకంపం (Earthquake) సంభవించిన విషయం తెలిసిందే. రాజ్‌కోట్‌(Rajkot) కు ఉత్తర వాయువ్యంగా 270 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. కాగా, ఆ రాష్ట్రాన్ని సోమవారం ఉదయం మరో రెండు భూకంపాలు వణికించాయి.కచ్‌ (Kutch), అమ్రేలి (Amreli) ప్రాంతాల్లో రిక్టరు స్కేలు (Richter Scale)పై 3.8, 3.3 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి.

అమ్రేలిలో గత వారం రోజుల్లోనే 3.1, 3.4 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించడం ఇది ఐదోసారి.2001 సంవత్సరంలో కచ్‌లో సంభవించిన భూకంపానికి సుమారు 13,800 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 1.67 లక్షల మంది గాయపడ్డారు. తాజా భూకంపంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)