దేశరాజధాని వేదికగా మరోసారి కదం తొక్కేందుకు రైతులు సిద్ధమయ్యారు. పలు డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ ఛలోను ప్రారంభించారు. పంజాబ్‌, హర్యానా ఇలా సమీప ప్రాంతాల నుంచి రైతులు తమ యాత్రను ప్రారంభించారు. అయితే ముందుగానే అప్రమత్తమైన పోలీసులు.. సరిహద్దుల్లో కంచెలతో భారీగా మోహరించారు. పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతన్నలు ఇప్పటికే దేశ రాజధాని దిశగా కదిలారు.

మరోవైపుభగ్నం చేసేందుకు పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రైతులు చేపట్టిన పాదయాత్రను దృష్టిలో ఉంచుకుని తిక్రీ సరిహద్దు వద్ద భద్రతను పెంచారు. రైతులు ఢిల్లీకి కవాతు చేయకుండా అడ్డుకునే చర్యల్లో భాగంగా పోలీసులు రోడ్డుపై కాంక్రీట్ స్లాబ్‌లను ఉంచారు. గురుగ్రామ్ నుండి ఢిల్లీ వైపు వెళ్లే హైవేపై భారీగా ట్రాఫిక్ ఏర్పడింది.  దేశ రాజధానిలో రైతులు నిరసన, బవానా స్టేడియంను జైలుగా మార్చాలని ఢిల్లీ ప్రభుత్వాన్నికోరిన కేంద్రం, రైతుల అరెస్టు సరికాదని తిరస్కరించిన కేజ్రీవాల్ సర్కారు

డిమాండ్లు ఏంటంటే..

కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు భరోసా కల్పించేలా చట్టం చేయడం,

స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు,

పంటరుణాల మాఫీ,

రైతులు-రైతుకూలీలకు పింఛన్లు ఇవ్వడం,

Here's Videos

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)