తల్లిదండ్రులను వదిలేసి వేరుగా ఉండాలంటూ భర్తను భార్య వేధిస్తే.. బాధితుడు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. మానసికంగా వేధింపులకు గురిచేయడమేగాక సహేతుకమైన కారణాలు చూపకుండా అత్తమామల నుంచి దూరంగా ఉండాలని భార్య ఒత్తిడి చేస్తుంటే.. విడాకులు కోరే హక్కు భర్తకు ఉంటుందని తేల్చిచెప్పింది.తల్లిదండ్రులతో ఉండడంతోపాటు వారిని పోషించడం కొడుకు బాధ్యత. భారతీయ సంస్కృతిలో ఇది భాగం’’ అని జస్టిస్ సౌమెన్ సేన్, జస్టిస్ ఉదయ్‌కుమార్‌ల ధర్మాసనం పేర్కొంది. తన భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు మార్చి 31న ఈ వ్యాఖ్యలు చేసింది.
Here's Bar Bench Tweet
Forcing husband to get separated from his parents, calling him coward and unemployed is cruelty: Calcutta High Court
report by @NarsiBenwal https://t.co/xNhtIlKeiT
— Bar & Bench (@barandbench) April 8, 2023
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)