GN Saibaba Released From Nagpur Central Jail: నాగ‌పూర్ సెంట్ర‌ల్ జైలు నుంచి ఢిల్లీ యూనివ‌ర్సిటీ మాజీ ప్రొఫెస‌ర్ జీఎన్ సాయిబాబ‌(Professor Saibaba)ను రిలీజ్ చేశారు. మావోయిస్టుల‌తో లింకు ఉన్న కేసులో రెండు రోజుల క్రితం బాంబే హైకోర్టు ఆయ‌న్ను నిర్దోషిగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2017 నుంచి ప్రొఫెస‌ర్ సాయిబాబ‌ నాగ‌పూర్ సెంట్ర‌ల్ జైలులోనే ఉంటున్నారు. మావోల‌తో లింకున్న కేసులో సాయిబాబ‌కు జీవిత‌కాల శిక్ష ప‌డింది. అయితే ఆయ‌న‌పై ఉన్న ఆరోప‌ణ‌ల‌ను ప్రాసిక్యూష‌న్ ప్రూవ్ చేయ‌లేక‌పోయింది.  మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ఆరోపణలు, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన బాంబే హైకోర్టు

నేడు జైలు నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాడ్లాడుతూ.. త‌న ఆరోగ్యం చాలా బ‌ల‌హీనంగా ఉంద‌ని,ఇప్పుడు తానేమీ మాట్లాడ‌లేన‌ని, ముందుగా మెడిక‌ల్ ట్రీట్మెంట్ తీసుకోవాల‌ని, ఆ త‌ర్వాత తాను మాట్లాడ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)