గోవాలో ఓ కారును ఓవ‌ర్‌టేక్ చేయ‌బోయిన ఎస్‌యూవీ.. బ్రిడ్జి రేలింగ్‌పైనుంచి న‌దిలో ప‌డిపోయింది. డ్రైవ‌ర్‌తో స‌హా ఆ ఎస్‌యూవీలో ఉన్న‌వారంద‌రూ మృతిచెంది ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం అర్ధరాత్రి జ‌రిగింది. ఆ రోడ్డుపై వెళ్తున్న ఓ వ్య‌క్తి ప్ర‌మాద‌స్థ‌లాన్ని వీడియో చిత్రీక‌రించాడు. ఇది ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. రాష్ట్ర రాజధాని పనాజీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోర్టాలిమ్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఉన్న జువారీ నది వంతెనపై కారును ఓవర్‌టేక్ చేసేందుకు ఎస్‌యూవీ ప్రయత్నించింది. అదుపుత‌ప్ప‌డంతో అది వంతెన రెయిలింగ్‌లను ఢీకొని నదిలో పడిపోయింది. గోవా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, భార‌త నావికాదళానికి చెందిన డైవర్లు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)