గుజరాత్ రాష్ట్రంలో అంతరిక్ష వ్యర్థాలు పలు ప్రాంతాల్లో పడి కలకలం రేపాయి. ఆనంద్ జిల్లాల్లోని భలేజ్, ఖంభోల్జ్, రాంపుర గ్రామాల్లో ఆకాశం నుంచి మిస్టీరియస్ శిథిలాలు రాలి పడ్డాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. భలేజ్ ప్రాంతాలో గురువారం సాయంత్రం 4.45 గంటలకు ఐదు కేజీల బరువున్న నల్ల రంగులోని మెటల్ బాల్ పడింది. ఖంభోల్జ్, రాంపుర గ్రామాల్లో కూడా ఇలాంటివి ఆకాశం నుంచి పడ్డాయి. ఈ మూడు గ్రామాలు 15 కిలోమీటర్ల పరిధిలో పక్కపక్కనే ఉన్నాయి.
గ్రామస్తులు దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆకాశం నుంచి రాలిపడిన శిథిలాలను పోలీసులు పరిశీలించారు. శాటిలైట్ వ్యర్థాలుగా వారు బావించారు. వీటి వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని ఆనంద్ జిల్లా ఎస్పీ అజిత్ రాజియన్ తెలిపారు. ఖంభోల్జ్ లో ఒక ఇంటికి సమీపంలో, మరో రెండు చోట్ల బహిరంగ ప్రదేశాల్లో ఆకాశం నుంచి వ్యర్థాలు పడినట్లు చెప్పారు. దీనిపై దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నిపుణులను పిలిపించినట్లు వెల్లడించారు.
Mysterious metal balls fall from space in Gujarat, pics surface https://t.co/6EUJAOE968
-via @inshorts. STRANGE
— Syed Qadri (@SyedQad22698550) May 13, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)